![]() |
![]() |
.webp)
సుమ అడ్డా షో బుల్లితెర మీద మస్త్ పాపులర్ షో. ఐతే ఈ షో గురించి లేటెస్ట్ ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఇంతకు ఎందుకు అనుకుంటున్నారా. ఇంతకు ఆ ప్రోమో ఏంటో తెలిస్తే విషయం తెలిసిపోతోంది. ముందు సుమ షో కోసం రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ ఉంటె...తన శ్రీవారు రాజా ఫోన్ చేసి ఆదివారం షాపింగ్ అంటే కుదరదు అంటుంది... తర్వాత శ్రీను గారు ఫోన్ చేసారు. "వీసా అపాయింట్ మెంట్ కోసం ఆదివారం రావాలా కుదరదు" అని ఫోన్ పెట్టేస్తుంది.
తర్వాత రన్బీర్ కపూర్ కూడా కాల్ చేశారు. "హా రన్బీర్ జి..ఆలియా అచ్చా హై...ప్రీ రిలీజ్ ఈవెంట్ ..కబ్..ఆదివారం ..అయ్యయ్యో.. నహీ హోతా.. నహి హోతా..సారీ, సారీ..కుదరదు కుదరదు " అంటూ ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ఎవరో కాల్ చేయడం ఆదివారం అనేసరికి పెట్టేయడం ఇలా కాల్స్ రావడం ఆదివారం అనేసరికి సుమ నో నో అని చెప్పడం జరిగిపోయింది. తర్వాత సుమ అసిస్టెంట్ "ఎందుకు మేడం ఆదివారం సాయంత్రం కుదరదు అంటున్నారు" అని అడిగాడు. ఎందుకంటే ఇక ఈ షో టైం చేంజ్ ఐపోతోంది. అవును ఇక మంగళవారం నుంచి ఆదివారానికి మారిపోతోంది. అది కూడా ఆదివారం రాత్రి 6 .30 కి . ఈ టైం చేంజ్ ప్రోమో భలే వెరైటీగ డిజైన్ చేసారు. ఇక ఈ ప్రోమోలో కొత్త కొత్త సెలబ్రిటీస్ ని తీసుకొచ్చారు. కావ్య కూడా కనిపించింది. ఇక ఆదివారం ఖాతాలో ఇప్పుడు మరో షో యాడ్ అయ్యిందన్నమాట
![]() |
![]() |